epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం
కమ్యూనిటీ హాళ్లతో అన్ని వర్గాలకు మేలు
మినీ ట్యాంక్ బండ్‌తో పెరిగిన‌ పట్టణ సౌందర్యం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు అవసరం
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

కాకతీయ, తొర్రూరు : తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. ఆరు కోట్లు డెబ్బై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ధోబి ఘాట్, స్మశాన వాటిక, మైత్రి భవన్ కమ్యూనిటీ హాల్, పద్మశాలి, స్వామి వివేకానంద, గౌడ సంఘం, నాయి బ్రాహ్మణ, విశ్రాంత ఉద్యోగుల, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను స్థానిక నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆయా వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

బీఆర్ఎస్‌ శంకుస్థాపనలకే పరిమితం..!

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమై పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులను పూర్తి చేసి చూపించామని అన్నారు. తొర్రూరును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణవాసులకు ఆహ్లాదాన్ని అందించేలా టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. మూడు కోట్లతో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయితే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు సేదతీరే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే సుందరీకరణ పనులు పూర్తి చేసి తొర్రూరును అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మంచినీటి సమస్యకు పరిష్కారంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా

రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తొర్రూరును తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరో పదిహేను కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్, టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, పోనుగొట్టి సోమేశ్వరరావు, చాపల అనిత బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, నరసయ్య, మహిళా బ్లాక్ అధ్యక్షురాలు పింగిలి ఉష పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.