epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్ర సాధకుడికి నోటీసులా..?!

రాష్ట్ర సాధకుడికి నోటీసులా..?!
కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయానికి నిద‌ర్శ‌నం
కేసీఆర్‌ను అవమానించేందుకే ఈ కుట్రల‌న్నీ
కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్‌ యత్నం
భయభ్రాంతుల పాలనకు బీఆర్‌ఎస్‌ భయపడదు
మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల గుణపాఠం తప్పదు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు

కాకతీయ, నర్సంపేట టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, స్వప్నికుడు కేసీఆర్‌కు నోటీసులు పంపడం వెనుక కాంగ్రెస్‌ ప్రభుత్వ కుట్రపూరిత రాజకీయాలే ఉన్నాయని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణ పేరుతో కేసీఆర్‌ను అవమానించడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి నుంచి తప్పించుకునేందుకే రోజుకో కొత్త నాటకానికి తెరలేపుతోందని విమర్శించారు. తెలంగాణలో పాలన కాకుండా రోజుకో ‘చలనచిత్రం’లా రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేని కాంగ్రెస్‌ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌పై నోటీసుల పేరిట రాజకీయం చేస్తున్నారని సుదర్శన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాలను మలినం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కోర్టు విచారణకు భయం!

కాంగ్రెస్‌ పార్టీ చేసిన కుంభకోణాలపై కోర్టులు స్వయంగా విచారణకు ఆదేశించినా, వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్‌ నాయకులు వెనక్కి తగ్గుతున్నారని ఆరోపించారు. నిజాలు బయటకు వస్తాయన్న భయంతోనే విచారణకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ తరఫున స్పష్టంగా, గర్వంగా చెబుతున్నామని అన్నారు. ప్రజలను మభ్యపెట్టే దొంగ నాటకాలు, అబద్ధపు ప్రచారాలకు ఇక కాలం చెల్లిందని హెచ్చరించారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆదేశాలతో స్థానిక నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని తమ పార్టీ దృష్టికి వచ్చిందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బెదిరించడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ తరహా భయపెట్టే రాజకీయాలకు తమ పార్టీ ఏమాత్రం భయపడదని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడతామని, ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమ చర్యలు లేకుండా నర్సంపేటలో నిర్మలమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఏకపక్ష పాలనకు, దోపిడీ రాజకీయాలకు ముగింపు పలకాలన్నదే నర్సంపేట ప్రజల ఆకాంక్ష అని అన్నారు. ఆ ఆకాంక్షను నెరవేర్చగల శక్తి బీఆర్‌ఎస్‌ పార్టీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే నర్సంపేట ప్రజలకు స్థిరమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం తప్పకుండా అందుతుందని మరోసారి స్పష్టం చేశారు. రేపు ఉదయం నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన అన్ని స్థానాల అభ్యర్థుల వివరాలను ప్రకటించి ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు సభాముఖంగా తెలిపారు. ప్రజలే తమ బలం, ప్రజలే తమ ఆశయమన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడించి కేసీఆర్‌ గౌరవాన్ని నిలబెట్టాలని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నర్సంపేట ప్రజలు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్‌ నాయకులు, ఎన్నికల కన్వీనర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.