epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ప్రచారం

8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ప్రచారం
కుటుంబ సేవలే తన బలం
అభివృద్ధే లక్ష్యం అని హామీ
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన దివంగత నేత, జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి కోడలైన స్వాతి, కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శనివారం ఉదయం 8వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమెకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తన మామ నల్లెల్ల కుమారస్వామి ఆశయాలే తనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. గతంలో 1995–2001 మధ్య సర్పంచ్‌గా, 2001–2006 మధ్య ములుగు ఎంపీపీగా నల్లెల కుమారస్వామి చేసిన సేవలు, అలాగే 2006–2011 మధ్య నల్లెల్ల కుమారస్వామి భార్య విజయ సర్పంచ్‌గా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తుండేలా ఉన్నాయని చెప్పారు. ఆ కుటుంబంపై ఉన్న ప్రజల విశ్వాసం, ప్రేమ తనకు కూడా లభిస్తుందని ప్రచారంలో ప్రజల స్పందన చూస్తే స్పష్టమవుతోందన్నారు. ఎనిమిదో వార్డు ప్రజలు నన్ను కౌన్సిలర్‌గా గెలిపిస్తే, మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కూడా అవకాశం కల్పించినవారవుతారు అని, ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను అని హామీ ఇచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని స్వాతి కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు!

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు! రామప్ప ఐలాండ్‌ అభివృద్ధికి రూ.13 కోట్లు గ్రామాల్లో పనుల...

రహదారి భద్రత, డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి!

రహదారి భద్రత, డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి! గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ...

పట్టభద్రులారా..! కాంగ్రెస్ భరతం పట్టండి

పట్టభద్రులారా..! కాంగ్రెస్ భరతం పట్టండి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటాలి ఓటరు నమోదు వేగవంతం...

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు భరోసా

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు భరోసా అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు నమోదు కావాలి మాజీ ఎమ్మెల్యే,...

రూ.1.42 లక్షలు కట్టిస్తే.. బిల్లు రూ.80 వేలే!

రూ.1.42 లక్షలు కట్టిస్తే.. బిల్లు రూ.80 వేలే! మెడికవర్‌ బిల్లింగ్‌పై రోగి ఆవేదన రూ.62...

పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం కావాలి!

పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం కావాలి! నివేదిక బహిర్గతం చేసి వెంటనే అమలు...

జాతీయ సమైక్యతకు పటేల్‌ సేవలు చిరస్మరణీయం

జాతీయ సమైక్యతకు పటేల్‌ సేవలు చిరస్మరణీయం లాల్‌బహదూర్‌ కళాశాలలో జాతీయ ఏకీకరణ దినోత్సవం ఎన్‌సీసీ...

దేవరుప్పులలో రైతుల కోసం పోరుబాట!

దేవరుప్పులలో రైతుల కోసం పోరుబాట! మండలాన్ని తక్షణమే కరువుగా ప్రకటించాలి నీళ్లడిగితే కేసులు పెడతారా?...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.