epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!
శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం
జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు
ఐదు చెక్ డ్యామ్‌లకు ప్రణాళిక
అడవి రహదారుల విస్తరణకు కేంద్ర అనుమతుల ప్రక్రియ
మంత్రులు పొంగులేటి, సీత‌క్క‌
జాతర అనంతరం మంత్రుల సమీక్ష

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ పుణ్యక్షేత్రంలో జాతర అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వనదేవతలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గద్దెల పరిసరాల్లో చేపట్టిన రాతి నిర్మాణాలు, ప్రహరీ గోడలు, శిల్పాలు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రిల్స్, ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించారు.
జాతరను తాత్కాలిక ఏర్పాట్లతో కాకుండా భవిష్యత్తు తరాలకు కనీసం రెండు వందల సంవత్సరాలు నిలిచేలా రాతి కట్టడాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. జాతర నాలుగు రోజుల పాటు విజయవంతంగా జరిగి సుమారు ఒక కోటి ఇరవై లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని చెప్పారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

జంపన్న వాగు అభివృద్ధి

మేడారం అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా గోదావరి జలాలను తీసుకురావడం, ఐదు చెక్ డ్యామ్‌లు నిర్మించడం ప్రణాళికలో భాగమని వెల్లడించారు. సమీపంలోని సాగునీటి చెరువులను సుందరీకరించనున్నట్లు చెప్పారు. జాతర సమయంలో వాహనాల రద్దీ దృష్ట్యా అడవిలోని రహదారులను విస్తరించేందుకు కేంద్ర అనుమతులు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నామని, అవసరమైతే మరింత భూమి సేకరిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర అనంతరం సమీక్ష నిర్వహించడం అరుదని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేడారాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.