epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
గ్రంథాలయ చైర్మన్‌పై మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం

కాకతీయ,ములుగు ప్రతినిధి:ములుగు మున్సిపాలిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన గ్రంథాలయ చైర్మన్ తక్షణమే బేషరతుగా ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ టెండర్ల వ్యవహారంలో గ్రంథాలయ చైర్మన్ జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి నిధులు ప్రజలకు సంబంధించినవని, ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లకు వాటి వినియోగంపై అవగాహనతో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో చేపట్టిన టెండర్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గౌరవ కలెక్టర్ మరియు మున్సిపాలిటీ కమిషనర్‌కు తమ విన్నపాన్ని తెలియజేసినట్లు చెప్పారు. అలాగే జనవరి 19, 2026న ములుగు మున్సిపాలిటీ జనరల్ బాడీ పూర్తిగా ఏర్పడకముందే హడావుడిగా టెండర్లు పిలిచినట్లు వారు ఆరోపించారు. ఆ టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫిబ్రవరి 26, 27 తేదీలలో మళ్లీ టెండర్లను రీకాల్ చేసినప్పటికీ పనుల పూర్తి వివరాలు, బడ్జెట్ వివరాలు వెల్లడించలేదని పేర్కొన్నారు.
టెండర్లను అవసరమైతే రద్దు చేసి బడ్జెట్‌పై పునఃసమీక్ష చేసి తిరిగి పిలిచే అధికారం సంబంధిత శాఖకు ఉంటుందని, అదే విధంగా ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లు కూడా ఆ పనులపై సమీక్ష చేయడం సహజమని వారు తెలిపారు. ఈ విషయంలో అవగాహన లేకుండా మాట్లాడి మహిళా కౌన్సిలర్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హెచ్చరించారు. ఇకపై మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మున్సిపాలిటీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ కోయిల లక్ష్మి, 7వ వార్డు కౌన్సిలర్ బైకాని సునీత ఓదెలు, 15వ వార్డు కౌన్సిలర్ రెసోజు పద్మ వేణుగోపాలచారి, 17వ వార్డు కౌన్సిలర్ గోనెల భరత్ కుమార్, 18వ వార్డు కౌన్సిలర్ బైకాని అనూష సాగర్ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.