epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు

కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని నెహ్రూ బస్తి ప్రాంతంలో వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఐదుగురు నిందితులను కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4వ తేదీన నరేష్ కోరి (40) అనే వ్యక్తిపై రైలు పట్టాల సమీపంలో దాడి జరగగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు శనివారం నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. నెహ్రూ బస్తిలోని రైలు పట్టాల వద్ద ఉన్న కిరాణా దుకాణం దగ్గర నరేష్ తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు అలియాస్ ఐలయ్య కలిసి అతనిపై దాడి చేసినట్లు తెలిపారు. రోకలి బండతో నరేష్ తలపై గట్టిగా కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలినట్లు చెప్పారు. తలకు పలుచోట్ల గాయాలు కావడంతో నరేష్ స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని వెల్లడించారు.

ఇల్లు వివాదం కారణం
గాయపడిన నరేష్‌ను వెంటనే వైద్యం కోసం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను అక్కడ చికిత్స పొందుతూ ఉండగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నెహ్రూ బస్తి ప్రాంతానికి చెందిన నిర్మల అనే మహిళకు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని ఐలయ్య కొన్ని నెలల క్రితం ఆక్రమించినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల ఐలయ్య వద్ద నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని చెప్పారు. అనంతరం ఆమె అనారోగ్య కారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో, అప్పు డబ్బులు ఇవ్వకపోవడంతో ఐలయ్య గత పద్దెనిమిది నెలలుగా తన కుటుంబంతో అక్కడే ఉంటున్నట్లు వెల్లడించారు. ఇల్లు ఖాళీ చేయాలని నిర్మల కోరినా, అప్పు డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పుతూ ఐలయ్య ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు. ఈ విషయంలో నిర్మలకు నరేష్ మద్దతుగా నిలిచాడని, దాంతో అతనిపై కక్ష పెంచుకుని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు నిందితులైన నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు అలియాస్ ఐలయ్యలను అరెస్ట్ చేసి, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.