epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?
కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు
డ్రెస్ కోడ్ పట్టించుకోదు… సమయపాలన పాటించదు
తోటి ఉద్యోగులు, భక్తులతో దురుసు ప్రవర్తన ఆరోపణలు
ఉన్నతాధికారులతోనూ తరచూ వాగ్వాదాలు
జాతర సమీక్ష అనంతరం ఎమ్మెల్యేతోనూ వివాదం
పలుమార్లు మెమోలు వచ్చినా మారని తీరు

కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సమయపాలన పాటించకపోవడం, డ్రెస్ కోడ్‌ను పట్టించుకోకపోవడం వంటి అంశాలతో పాటు తోటి ఉద్యోగులు, భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు మెమోలు జారీ చేసినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడం ఆలయ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి అయినప్పటికీ అధికారిక బాధ్యతలను మించి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఉద్యోగుల మాటల్లో ఆమె ధర్మకర్తలా వ్యవహరిస్తూ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆలయంలో జరుగుతున్న పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటూ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఉద్యోగా…? లేక ధర్మకర్తనా?

ఆమె అధికారికంగా ఒక ఉద్యోగి మాత్రమే అయినప్పటికీ ఆలయ వ్యవహారాల్లో అధిక ప్రాధాన్యం చూపిస్తూ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆలయ సిబ్బంది అంటున్నారు. ఇటీవల నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలోనూ ఎవరి అనుమతి లేకుండా వేదికపై కూర్చోవడం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై ఆలయ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ పరిస్థితి మారడం లేదని చెబుతున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాల్సిన ఉద్యోగి ఇలా వ్యవహరించడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఉన్నతాధికారులతోనూ వివాదాలు

సంబంధిత మహిళా ఉద్యోగి ఉన్నతాధికారులతో కూడా తరచూ వాగ్వాదాలకు దిగుతున్నట్లు సమాచారం. విధి నిర్వహణకు సంబంధించిన అంశాలపై పలుమార్లు వివాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. జాతర సమయంలో ఇతర శాఖల అధికారులతో కూడా ఆమె దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొమ్మాల జాతర అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత స్థానిక ఎమ్మెల్యేతో కూడా ఆమె వాగ్వాదానికి దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ఆలయ వ్యవహారాలు మరింత వివాదాస్పదంగా మారాయని స్థానికులు అంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రవర్తనపై గతంలో పలుమార్లు మెమోలు జారీ చేసినప్పటికీ ఆమె తీరు మారలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి యథాతథంగానే కొనసాగుతోందని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది, స్థానికులు కోరుతున్నారు. దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినకుండా క్రమశిక్షణతో వ్యవహరించేలా చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.