జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి
ప్రోగ్రాం కన్వీనర్ పొనుగోటి పాపారావు పిలుపు
కాకతీయ, హనుమకొండ: నవంబర్ 3న హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రోగ్రాం కన్వీనర్ పొనుగోటి పాపారావు పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని సామ జగన్మోహన్రెడ్డి భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వ ఏబీవీపీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పూర్వ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లుకు అభినందనలతో కూడిన సన్మానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు

