epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సెల్ టవర్ బ్యాటరీల దొంగల ముఠా అరెస్ట్

సెల్ టవర్ బ్యాటరీల దొంగల ముఠా అరెస్ట్
పోలీసుల అదుపులో ఐదుగురు అంతఃరాష్ట్ర నేర‌గాళ్లు
144 సెల్ టవర్ బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు స్వాధీనం
మహారాష్ట్రలో విక్రయించి జల్సాలు : సీపీ సన్‌ప్రీత్ సింగ్

కాకతీయ, హనుమకొండ : అంతర్ రాష్ట్ర స్థాయిలో సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడిన ముఠాలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి పోలీసులు ప్రత్యేక దర్యాప్తుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేష్, బొంగరాల సుధాకర్, తన్నీరు శివాజీ, బీమనబోయిన నరసింహ, గడగోజు సురేష్‌లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.98 లక్షల విలువైన 144 సెల్ టవర్ బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు, రెండు ట్రాలీలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రలో విక్రయించి జల్సాలు

ప్రధాన నిందితుడు గణేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుధాకర్, శివాజీకి సెల్ టవర్, జనరేటర్ పనులపై అవగాహన ఉంది. ఈ పరిజ్ఞానంతో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన బ్యాటరీలను మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో విక్రయించి డబ్బుతో జల్సాలు చేసేవారు. చెరువుల్లో చేపల చోరీలకు పాల్పడే వారితో కలిసి చోరీలకు అనుకూల ప్రాంతాలను గుర్తించేవారు. ఈ ముఠా వరంగల్ కమిషనరేట్‌తో పాటు యాదాద్రి, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. అనంతసాగర్ ప్రాంతంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. దేవన్నపేట అవుటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద ఐదుగురిని అరెస్టు చేశారు. డీసీపీ దారా కవిత ఆధ్వర్యంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఇన్స్‌పెక్టర్ చేరాలు, ఎస్ ఐలు దేవేందర్, సుజిత్ రెడ్డి, కానిస్టేబుళ్లు క్రాంతి కుమార్, బావు సింగ్, వెంకట స్వామి, భరత్ తదితరులు పాల్గొన్నారు. వారి పనితీరును కమిషనర్ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.