ఐటీడీఏలో అంబేద్కర్ జయంతి వేడుకలు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఐటిడిఏ కార్యాలయం, ఏటూరునాగారంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎపిఓ (జనరల్) జె. వసంతరావు, ఎస్డీసీ (టిడబ్ల్యూ) జి. ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎస్. రాజ్‌కుమార్, ఎటిడిఓ (టిడబ్ల్యూ) అజయ్, జియాలజిస్ట్ ఆలం కిషోర్‌తో పాటు ఐటిడిఏ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచనలు, సమానత్వం కోసం చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

