చిన్న ముప్పారం లో అంబేద్కర్ జయంతి వేడుకలు
కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషిచేసి అణగారిన వర్గాల కోసం అక్షర జ్ఞానం కల్పించిన మహోన్నత అక్షర శిఖరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేసినందుకు, డీజే డెకరేషన్ అందించిన దర్శనం రాము కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భవాని శేఖర్, ఉప సర్పంచ్, గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మల్లం ఐలయ్య, వార్డ్ మెంబర్లు ఈసంపెల్లి సాయి కుమార్, దర్శనం లక్ష్మి, యాకయ్య కట్ల అనిల్, ఏళ్ళ బోయిన పద్మా కనకయ్య, సంగం ఉపాధ్యక్షలు బానోత్ నరేష్,చిన్నల కట్టమల్లు, ఎల్లబోయిన కనకయ్య, ప్రధాన కార్యదర్శి ఇసంపేల్లి సాయికుమార్, కోశాధికారి తాళ్ల మహేష్, ప్రచార కార్యదర్శి దర్శనం వీరన్న,కుల పెద్ద మనుసులు దర్శనం వీరయ్య, దర్శనం సోమ్మయ్య, కారోబార్ రాము,కాలనీ అధ్యక్షులు దర్శనం వెంకటేష్,ఉపాధ్యక్షులు దర్శనం వివేక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి గణపతి, కోశాధికారి సురుగు హరీష్, వీరితో పాటు యూత్ సభ్యులు దర్శనం యుగేందర్, దర్శనం కృష్ణ, దర్శనం శ్రీను,దర్శనం వెంకన్న, ధర్మారపు యాకంతం,దర్శనం వీరన్న,రావుల రాణదీర్ రెడ్డి, కాలేరు లక్ష్మి నర్సు, కాలేరు నేతాజీ, గాడిపెల్లి వెంకటేశ్వర్లు, నామాల మహేష్,భోగం అనిల్, దర్శనం నారాయణ, దర్శనం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

