epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నర్సంపేటలో ఉద్రిక్త‌త‌

నర్సంపేటలో ఉద్రిక్త‌త‌
ప‌రామ‌ర్శ‌ల‌కు వెళ్తున్న‌ బీఆర్ ఎస్ నేత‌ల అరెస్టు
న‌ర్సంపేట‌లో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ర‌ఘునాథ‌ప‌ల్లి టోల్‌గోట్ వ‌ద్ద మాజీమంత్రి స‌బితా ఇంద్రెడ్డి, వినోద్ కుమార్, మాలోతు కవిత అరెస్టు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అరూరి రమేష్ గృహనిర్బంధం
ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే : ఎర్రబెల్లి ధ్వజం
మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్

కాకతీయ, వరంగల్ బ్యూరో: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసన సెగలు మిన్నంటాయి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో పరామర్శలకు కూడా అనుమతి నిరాకరించడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోతు కవితలను రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు వారి వాహనాలను నిలిపివేసి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రఘునాథపల్లి సీఐ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు, హనుమకొండలోని తన నివాసం నుంచి నర్సంపేటకు బయలుదేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాంనగర్‌లోని ఎర్రబెల్లి నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించి, వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. న‌ర్సంపేట‌లో ఆందోళ‌న చేప‌ట్టిన న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రభుత్వ హత్యే: ఎర్రబెల్లి ఆగ్రహం
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “శంకర్ గౌడ్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని నమ్మించి మోసం చేసినందుకే ఈ పరిస్థితి దాపురించింది” అని ఆరోపించారు. ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోతే కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ముదురుతున్న ఆందోళన
శంకర్ గౌడ్ ఘటన తర్వాత మనస్తాపంతో మరో ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ‌టంతో కార్మికుల్లో నెలకొన్న ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. నర్సంపేటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ తరహా ఆంక్షలు విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలు వ్యక్తమవుతుండటంతో రాజకీయ ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతమవుతుందని ఆర్టీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.