epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

​హైదరాబాద్‌లో అర్హులైన వారందరికీ అవకాశం

​జూన్ 2న అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్

​న్యాయపరమైన చిక్కుల్లేకుండా టౌన్ షిప్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు

కాకతీయ, ​హైదరాబాద్ : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని వివిధ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ కీలక విషయాలను వెల్లడించారు.

​కమిటీ ఏర్పాటు.. వివరాల సేకరణ

​జర్నలిస్టులందరూ ఒకే మాట మీదకు రావడం శుభ పరిణామన్న మంత్రి, అన్నీ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి సమాచార కమిషనర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సొసైటీల ప్రతినిధులతో కలిపి 10 మందికి మించకుండా ఈ కమిటీని ఏర్పాటు చేసుకుని, అర్హులైన జర్నలిస్టులందరి వివరాలను కమిషనర్ ఆధ్వర్యంలోని సభ్యులకు అందజేయాలని సూచించారు.

  టౌన్ షిప్ ఏర్పాటు పై ఆలోచన

​ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులకు అందరికీ కలిపి ఒకేచోట ఒక భారీ టౌన్ షిప్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా, గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు జరపాలనేది ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. కేటాయింపు ధర విషయంలో జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన హామీ ఇచ్చారు.

​అర్హత నిబంధనలు.. పనుల వేగం

​హైదరాబాద్‌లో కనీసం పది సంవత్సరాలు పనిచేసిన జర్నలిస్టులకు, ప్రభుత్వం అలాట్ చేసే నాటికి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సొసైటీల పేరుతో గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా, సొసైటీలోని సభ్యులతో ఆయా సొసైటీలు జాబితా తయారు చేసి కమిటీకి ఇవ్వాలని, వాటిని సమాచార కమిషనర్ పరిశీలిస్తారని ఆయన వివరించారు. ఈ రోజు నుంచే సొసైటీ పనుల వేగం పెంచాలని మంత్రి కోరారు.

​ఈ సమావేశంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డితో పాటు వివిధ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.