epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల బియ్యంతో.. మిల్లులో దందా!

పేదల బియ్యంతో.. మిల్లులో దందా!
ఇబ్రహీంపట్నం రైస్‌ మిల్లులో 829 బస్తాలు పట్టివేత
న్యూ బన్సాల్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ ఉండటంతో పీడీఎస్‌ బియ్యంగా గుర్తింపు
బియ్యం తరలింపునకు సిద్ధంగా ఉన్న లారీ స్వాధీనం
మూడు పేర్లపై ఫిర్యాదు.. సరఫరా మూలంపై దర్యాప్తు
తెల్ల రేషన్‌ కార్డుదారుల బియ్యం మిల్లుకు ఎలా చేరింది?

కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న న్యూ బన్సాల్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌లో పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 829 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న బియ్యంలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ ఉండటంతో పీడీఎస్‌ సరఫరాతో సంబంధం ఉన్న బియ్యంగా అధికారులు గుర్తించారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం ప్రైవేట్‌ మిల్లుకు ఎలా చేరింది? సరఫరా వ్యవస్థలో ఎక్కడ మళ్లింపు జరిగింది? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

మిల్లులో 829 బస్తాలు పట్టివేత

ఇబ్రహీంపట్నంలోని న్యూ బన్సాల్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌లో పీడీఎస్‌ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 829 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సుమారు 50 కిలోల బరువున్న 677 బస్తాలు, 25 కిలోల బరువున్న మరో 101 బస్తాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా లారీలో ఉన్న 51 బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వలు, రవాణా వివరాలను పరిశీలించిన అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. బియ్యాన్ని తరలించేందుకు ఉపయోగిస్తున్నట్లు అనుమానించిన టాటా లారీని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం నంబర్‌ టీఎస్‌ 03 యూబీ 3399గా గుర్తించారు. లారీలో 51 బస్తాల బియ్యం ఉన్నట్లు వెల్లడించారు. మిల్లులో నిల్వ ఉన్న బియ్యం, లారీలో ఉన్న బియ్యం మూలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. రవాణాకు సంబంధించిన పత్రాలు, కొనుగోలు వివరాలు, సరఫరా మార్గాలపై విచారణ కొనసాగుతోంది.

ఫోర్టిఫైడ్‌ రైస్‌తో పీడీఎస్‌ బియ్యంగా గుర్తింపు

స్వాధీనం చేసుకున్న బియ్యంపై అధికారులు పరీక్షలు నిర్వహించారు. అందులో ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ లక్షణాల ఆధారంగా బియ్యం పీడీఎస్‌ సరఫరాతో సంబంధం ఉన్నదిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం తెలిపింది. తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వ పథకం కింద అందాల్సిన బియ్యం ప్రైవేట్‌ మిల్లులోకి ఎలా చేరిందనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. బియ్యం ప్రభుత్వ సరఫరా వ్యవస్థ నుంచి మళ్లించబడిందా? లేక మధ్యవర్తుల ద్వారా మిల్లుకు చేరిందా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. న్యూ బన్సాల్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ యజమాని గీతేశ్‌ బన్సాల్‌ ఈ బియ్యాన్ని సిద్ధిపేట జిల్లాలోని మోతె గ్రామంలో ఉన్న భారతి ఇండస్ట్రీస్‌ నుంచి కొనుగోలు చేసినట్లు అధికారులకు తెలిపినట్లు సమాచారం. అయితే బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు? కొనుగోలు పత్రాలు ఉన్నాయా? సరఫరా చేసిన సంస్థకు బియ్యం మూలం గురించి తెలుసా? అనే ప్రశ్నలకు దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది. ఈ వ్యవహారంలో గీతేశ్‌ బన్సాల్‌తో పాటు శ్రీరామ్‌ లోహియా, భారతి ఇండస్ట్రీస్‌ యజమాని నాగభూషణంపై అధికారులు ఫిర్యాదు చేశారు.

పీడీఎస్‌ నియమాల ఉల్లంఘనపై కేసు

తెలంగాణ పీడీఎస్‌ రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌–2016లోని క్లాజ్‌ 17(ఈ) ఉల్లంఘనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బియ్యం నిల్వ, కొనుగోలు, తరలింపునకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశం దర్యాప్తులో తేలాల్సి ఉంది. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు తదుపరి ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందిస్తారు. ఈ వ్యవస్థలోని బియ్యం అక్రమంగా మళ్లింపునకు గురైతే అర్హులైన లబ్ధిదారులకు నష్టం కలుగుతుంది. ఇబ్రహీంపట్నం మిల్లులో పట్టుబడిన బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? సరఫరా వ్యవస్థలో ఏ దశలో మళ్లింపు జరిగింది? ఇందులో మరెవరైనా మధ్యవర్తుల పాత్ర ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కొనుగోలు పత్రాలు, రవాణా రికార్డులు, బియ్యం నిల్వల మూలాలను పరిశీలించిన తర్వాతే ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా! ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం...

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు...

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు...

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌!

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌! మాజీ ప్రియురాలి సాయంతో సైబర్‌ నేరగాడి వలపు వల వెయ్యి...

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.