epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బడిబాటను విస్తృతంగా నిర్వహించాలి!

బడిబాటను విస్తృతంగా నిర్వహించాలి!
ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతం నమోదు పెంపు లక్ష్యం
మూతపడిన ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం
హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
బడిబాటపై డీఈవో, ఎంఈవోలతో కలెక్టర్ సమీక్ష
కాకతీయ, హనుమకొండ : జిల్లాలో బడిబాట కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను గణనీయంగా పెంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో బడిబాట కార్యక్రమాల పురోగతిపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, మండల విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 16 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కనీసం 10 శాతం పెరిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాలు, మండల స్థాయి అధికారులను బడిబాట కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ఇంటింటి సర్వేతో సరికొత్త నమోదు
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, సురక్షిత వాతావరణం కల్పిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. గతంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో మూతపడిన పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని, నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టాలని ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రవాణా భత్యం ప్రతి అర్హ విద్యార్థికి అందేలా చూడాలని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందుగా భవనాలకు రంగులు వేయడం, పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయడం వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలకు ఆదేశం
నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల అర్హతలు, అనుమతులు, ఫీజుల నిర్మాణంపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమంలో ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు గృహాల లెక్కింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ಈ సమావేశంలో విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, ఏఎంఓ డాక్టర్ మన్మోహన్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుమా, జీసీఈవో సునీత, జిల్లాలోని 14 మండలాల మండల విద్యాశాఖ అధికారులు, పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.