epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
విద్యార్థులకు ఉదయం అల్పాహారం, రాగిజావ పథకం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో కీలక నిర్ణయాలు
పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని, అర్హులైన వారందరికీ పథకాలను చేరవేసేలా అధికారులు పని చేయాలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ ఫంక్షన్‌ హాల్‌లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క జయ జయహే తెలంగాణ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా, మండల స్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, సన్న వడ్లకు బోనస్, కళ్యాణ లక్ష్మి, వడ్డీ లేని రుణాలు వంటి పథకాల అమలు తీరును ఆమె సమీక్షించారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు, జిల్లాలో కొత్తగా 38 వేల పైచిలుకు పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.

విద్యార్థులకు పౌష్టికాహారం
రాష్ట్రవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. రోజు విడిచి రోజు రాగి జావ, వేడి పాలు అందించడంతో పాటు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తామన్నారు. పదవ తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. స్థానిక నిరుద్యోగ యువత కోసం త్వరలో వందకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెబుతూ.. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ ద్వారా వందల సంఘాలకు కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మే 25వ తేదీ నుంచి మహిళా వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ప్రజల కన్నీళ్లు తుడవడమే లక్ష్యం
ప్రజా సమస్యలను, కష్టాలను గుర్తించి వాటిని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామచంద్రపూర్ గ్రామ శివారులోని పది వేల ఎకరాల భూములకు రీ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధికి 22 ఎకరాల భూమిని సేకరించి నష్టపరిహారం చెల్లించామని, ఆలయ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.