epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాఠశాలకు మళ్లీ జీవం

పాఠశాలకు మళ్లీ జీవం
పూర్వ విద్యార్థుల గొప్ప సంకల్పం!
శిథిలావస్థ నుంచి విద్యామందిరం వైపు అడుగులు
తాడిచర్ల మండల కేంద్రంలో పాఠశాల పునరుద్ధరణకు గ్రామస్థుల సన్నద్ధత
పిల్లల భవిష్యత్తు కోసం కదిలిన ‘అలనాటి’ విద్యార్థులు
అధికారుల సాయం కోసం ఎదురుచూస్తున్న వెల్మలపల్లి వాసులు

కాక‌తీయ‌, మ‌ల్హ‌ర్ : ఒకప్పుడు విద్యార్థుల కేరింతలతో కళకళలాడిన పాఠశాల.. కాలక్రమేణా విద్యార్థుల కొరతతో మూతపడింది. ఆ తర్వాత భవనం శిథిలావస్థకు చేరి, పిచ్చి మొక్కలతో నిండిపోయి నిరుపయోగంగా మారింది. అయితే, తమకు అక్షరజ్ఞానం ప్రసాదించిన విద్యామందిరం మళ్లీ తెరుచుకోవాలని, తమ గ్రామంలోని చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాలని భావించిన పూర్వ విద్యార్థులు అద్భుతమైన సంకల్పంతో ముందుకు వచ్చారు. వెల్మలపల్లిలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలకు మళ్లీ జీవం పోసేందుకు వారు చేస్తున్న కృషి ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి, నేడు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది విద్యార్థులు తమ సొంత గ్రామంలోని పాఠశాల దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. గ్రామస్థులతో కలిసి పాఠశాల పునరుద్ధరణకు నడుం బిగించారు. పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించడం, శిథిలమైన భవనానికి మరమ్మతులు చేయడం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా వారు కార్యాచరణ సిద్ధం చేశారు. తమ పిల్లలు కూడా అదే పాఠశాలలో చదువుకోవాలన్న బలమైన ఆకాంక్ష వారిలో కనిపిస్తోంది.

దూరభారం తప్పేనా?
ప్రస్తుతం గ్రామంలో పాఠశాల లేకపోవడంతో చిన్నపిల్లలు విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రానున్న విద్యాసంవత్సరం నాటికి పాఠశాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, స్థానిక విద్యార్థులను తిరిగి చేర్పించాలని పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు దృఢ నిశ్చయంతో ఉన్నారు. గ్రామ భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం స్పందించాలి!
అధికారులు చొరవ తీసుకుని పాఠశాల పునఃప్రారంభానికి అనుమతులు మంజూరు చేయాల‌ని కోరుతున్నారు. మౌలిక వసతులు కల్పించి, మెరుగైన విద్యాబోధనకు చర్యలు తీసుకోవాల‌ని కోరుతున్నారు. ఒకప్పుడు శిథిలావస్థకు చేరిన ఈ విద్యామందిరం, ఇప్పుడు గ్రామ విద్యాభివృద్ధికి కొత్త ఆశాకిరణంగా మారుతోంది. అధికారుల సహకారం అందితే, ఆ పాఠశాల మరోసారి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని, చిన్నారుల విద్యాప్రయాణం సులభతరం అవుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి, పాఠశాల పునఃప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.