epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆపరేషన్ రేపే ఇగ!

ఆపరేషన్ రేపే ఇగ!
ఎంజీఎం ఆస్పత్రిలో ఆపరేషన్లలో జాప్యం
వైద్యులు లేరా? సమయం దొరుకుతలేదా?
రోగులను థియేటర్ వద్దకు తీసుకెళ్లి మళ్లీ వార్డుల్లోకి
నెల రోజులు గడుస్తున్నా ఆపరేషన్ల కోసం పడిగాపులు
ఫిర్యాదు ఎవరికి చేయాలో తెలియని బాధితులు
నర్సులు ఇచ్చే మందులు, ఉచిత భోజనంతో సరి

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గుర్రాన్ని చెరువు వద్దకు తీసుకెళ్లగలం గానీ.. నీటిని తాగించలేం అన్నచందంగా మారింది ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల పరిస్థితి. ఆర్థోపెడిక్ వార్డుకు చెందిన రోగులు ఆపరేషన్ల కోసం నెల రోజులకు పైగా ఎదురుచూస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరిగి శస్త్ర చికిత్సల అవసరమైన బాధితులు డాక్టర్ల దయాదాక్షిణ్యాల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. తమ వంతు ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుందా? అని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఆదివారంతోపాటు పండుగలకు సెలవులు పాటిస్తుండడంతో రోగులు సోమవారం నుంచి శనివారం వరకు తమ సీరియల్ వచ్చేనా అంటూ దిగులుతో బాధను దిగమింగుకుంటున్నారు.

ఓ స్త్రీ రేపురా!

కొన్నేళ్ల క్రితం ఇంటి ముందు గోడల మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ రాసేవారు. అదే పరిస్థితి ఎంజీఎం ఆపరేషన్ థియేటర్ వద్ద కనిపిస్తోందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి మోకాలి వద్ద ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అతడు ఆస్పత్రిలో చేరి నెల రోజులకు పైగానే అవుతోంది. రెండు వారాలుగా అతడిని ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకెళ్తున్నారు. ఒకసారి టైం అయిపోయిందని, మరో రోజు మత్తు మందు లేదని, ఇలా ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకెళ్లిన రోజల్లా ఏదో సాకుతో తిరిగి వార్డుకు తరలిస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. ఇలా ఆర్థోపెడిక్ వార్డులో చాలామంది పరిస్థితి ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నర్సులు ఇచ్చే మందులు, ఉచిత భోజనం!

ఆపరేషన్ అవసరం ఉన్నవారికి చేసే వరకు మందులు పెద్దగా ఇవ్వరు. కేవలం నొప్పి నివారణ కోసం రోజు వారీగా రెండు, మూడు గోలీలు ఇస్తుంటారు. ఇదే ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఎంజీఎంలో రోగులకు అందే వైద్యం. మధ్యాహ్నం పూట ఉచితంగా అందే భోజనం మినహా… వారి ఆరోగ్యాన్ని పరిశీలించే వారే ఉండరు. పగటి పూట వార్డులో కనీసం ఒక నర్సు కూడా అందుబాటులో ఉండరు. రోగుల వద్ద ఎవరూ లేని సమయంలో ఏదైనా అవస్థ అనిపిస్తే.. నర్సులను పిలిచేందుకు అవకాశం లేకపోవడంతో బాధను దిగమింగుకుని మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని పలువురు బాధితులు పేర్కొంటున్నారు.

పైరవీలు చేసిన వారికే ప్రియారిటీ!

ఆపరేషన్లు, ఇతర వైద్య సేవల్లో పైరవీలు చేసిన వారికే వైద్యులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకెళ్లిన కొందరు రోగులు పైరవీలు చేసే స్థాయి లేక.. రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక రోజుకు పదిమందికి మించి ఆపరేషన్లు చేయడం లేదని తెలుస్తోంది. ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణకే పెద్ద ఆస్పత్రి. రోజుకు పదే ఆపరేషన్లు అంటే.. రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న శరీర భాగాలు పూర్తిగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుందేమోనని బాధితులు కుమిలిపోతున్నారు. ఇదిలా ఉండగా, ఎంజీఎంలో ఆదివారం తోపాటు పండుగల రోజున కూడా ఆపరేషన్ థియేటరు సెలవులు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కూడా ఆపరేషన్ల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.