గడువులోగా స్కూల్ పనులు పూర్తి చేయాలి
నాణ్యత విషయంలో రాజీ పడొద్దు
విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల: పరకాల పట్టణంలోని రాజుపేటలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణంలో ఎక్కడా నాణ్యత తగ్గకుండా, వేగంగా పనులు కొనసాగేలా చూడాలని సూచించారు. విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పాఠశాల అందుబాటులోకి రావడం ద్వారా స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా, గడువులోగా పనులు పూర్తి చేసి పాఠశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

