రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి
రజక సంఘం ఏటూరునాగారం మండల అధ్యక్షుడు పర్వతాల ఎల్లయ్య
కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: అణగారిన వర్గాల హక్కుల కోసం వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రజక సంఘం అధ్యక్షుడు పర్వతాల ఎల్లయ్య అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పర్వతాల ఎల్లయ్య పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో రజకులు ఐక్యతను చాటుతూ హక్కుల సాధనకు సంఘటితంగా ముందుకు సాగాలని కోరారు. రజకుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం చైతన్యంతో ఉద్యమాలను బలోపేతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో కుదురుపాక రాజేష్, పర్వతాల కుమారస్వామి, పర్వతాల నర్సయ్య, చింతలపల్లి సుమన్, పర్వతాల రమేష్, రమేష్ (పెద్దోడు), కుమ్మరికుంట్ల సతీష్, కుదురుపాక గిరిబాబు, పర్వతాల రత్తమ్మ, వార్డు సభ్యులు అంగాల వీరన్న, గంప సాయి కిరణ్, పెద్దబోయిన బాలకృష్ణ, బట్టు గోపి, కూనూరు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

