epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

న్యూట్రిషన్ పేరుతో నిలువు దోపిడీ

  • తాడిచర్ల కేంద్రంగా భారీ మెడికల్ మాఫియా!
  • వ్యాధులు నయం చేస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ
  • ఒక్కో రోగి నుంచి రూ. 5 వేల వసూలు.. చైన్ సిస్టమ్ మోసాలు!
  • బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులు నయమ‌వుతాయంటూ నమ్మబలుకుతున్న కేటుగాళ్లు
  • రోగులనే ఏజెంట్లుగా మారుస్తూ నిలువునా మోసం!
  • ముత్తారం, మంథని, మల్లారం ప్రాంతాలకు విస్తరిస్తున్న నెట్‌వర్క్

కాక‌తీయ‌, మ‌ల్హార్ : భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌ల్హార్ మండ‌ల‌కేంద్రం, తాడిచర్లలో అమాయక ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి, లక్షల రూపాయలు దోచుకుంటున్న ఒక పెద్ద ‘న్యూట్రిషన్ మెడికల్ మాఫియా’ దందా వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు తాడిచర్లలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, ఏమాత్రం నాణ్యత లేని న్యూట్రిషన్ పౌడర్ల పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులతో పాటు ఏ రకమైన దీర్ఘకాలిక వ్యాధులైనా పూర్తిగా నయం చేస్తామని ఈ ముఠా ఊదరగొడుతోంది. ఒక్కో రోగి నుంచి రూ. 5,000 వరకు వసూలు చేస్తూ, న్యూట్రిషన్ పౌడర్ డబ్బాలను అంటగడుతున్నారు. అయితే, తాము ఇస్తున్న మందులతో పాటు రోగులు గతంలో వాడుతున్న బీపీ, షుగర్ టాబ్లెట్లను కూడా కొనసాగించాలని వీరు సూచిస్తున్నారు. ఆ టాబ్లెట్ల వల్ల వ్యాధి అదుపులో ఉంటే.. అది తామిచ్చిన న్యూట్రిషన్ పౌడర్ల మహిమేనని ప్రజలను నమ్మిస్తూ, వారి సొమ్ముతో ఆడుకుంటున్నారు.

చైన్ సిస్టమ్.. ఊబిలోకి అమాయకులు!
ఈ మాఫియా చైన్ సిస్టమ్ ద్వారా నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. కస్టమర్లను ఏజెంట్లుగా మారుస్తూ, కొత్తవారిని చేరిస్తే కమిషన్ ఇస్తామని, ఎక్కువ మందిని చేరిస్తే భారీ లాభాలొస్తాయని ఆశచూపుతున్నారు. దీంతో డబ్బుల ఆశతో అమాయక గ్రామీణ ప్రజలు తమ బంధుమిత్రులను కూడా ఈ ఊబిలోకి లాగుతున్నారు. తాడిచర్లలో సక్సెస్ అయిన ఈ దందా, ఇప్పుడు ముత్తారం, ఖమ్మంపల్లి, మంథని, మల్లారం ప్రాంతాలకు పాకింది. అక్కడ కూడా కొత్త బ్రాంచ్‌లను ఓపెన్ చేసి అక్రమార్జనే ధ్యేయంగా రోజుకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ప్రజల నుంచి దండుకుంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మంట
గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా దందా సాగుతున్నా.. స్థానిక వైద్య ఆరోగ్య శాఖ, డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో, సొమ్ముతో ఆడుకుంటున్న ఈ ముఠాపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని, వారిని కఠినంగా శిక్షించాలని తాడిచర్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరికొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తాడిచర్లలోని ఈ అక్రమ వ్యాపార స్థావరాలపై దాడులు చేస్తారా? లేదా అన్నది వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.