epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అనధికార ఫ్లెక్సీలపై జీడబ్ల్యూఎంసీ కొరడా

అనధికార ఫ్లెక్సీలపై జీడబ్ల్యూఎంసీ కొరడా
నెల రోజుల పాటు నగరవ్యాప్త ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. పట్టణ ప్రణాళిక విభాగం, డీఆర్ఎఫ్ బృందాలు ఏసీపీల నేతృత్వంలో నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అంబేద్కర్ సర్కిల్, హన్మకొండ మిషన్ హాస్పిటల్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ వంటి ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులు, ప్రచార బోర్డులను తొలగించారు. నగర సౌందర్యానికి భంగం కలిగించే విధంగా ఎవరూ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు. నగర సుందరీకరణలో భాగంగా మొదటి విడతలో వారం రోజుల్లో అనధికార ఫ్లెక్సీలను పూర్తిగా తొలగిస్తామని, రెండో విడతలో ప్రభుత్వ భవనాలు, గోడలపై అనుమతి లేని వాల్ రైటింగ్స్, పోస్టర్లు, పెయింటింగ్‌లను తొలగించి, వాటి స్థానంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్‌లు రూపొందిస్తామని ఆయన తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జీడబ్ల్యూఎంసీ పరిధిలో నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రత్యేక డ్రైవ్‌కు ప్రజలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు సహకరించాలని కమిషనర్ కోరారు. పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, వాణిజ్య సంస్థలు మున్సిపల్ అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పార్కులు, విద్యుత్ స్తంభాలు, సెంట్రల్ డివైడర్లు, రహదారి కూడళ్ల వద్ద గోడపత్రికలు, స్టిక్కర్లు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించబడిందని కమిషనర్ తెలిపారు. సుందరమైన గ్రేటర్ వరంగల్ నిర్మాణమే జీడబ్ల్యూఎంసీ లక్ష్యమని, నగర సౌందర్యాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.