epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు

నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి దారుణం

50 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు

గతంలో జీవిత ఖైదు అనుభవించిన నిందితుడు

కాక‌తీయ‌, వరంగల్ సిటీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్‌పై శనివారం అర్ధరాత్రి దారుణ హత్యాయత్నం జరిగింది. ఎనుమాముల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అడుప మహేశ్‌ను దుండగులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. సుమారు 50 శాతం కాలిన గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అడుప మహేశ్, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన జన్ను మధు, శనివారం రాత్రి కోటిలింగాల ఆలయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి రావాలని అడుప మహేశ్‌ను పిలిచాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మద్యం సేవించి, పత్రి కుమార్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే వద్ద తన గురించి ఏమి చెప్పావని మహేశ్‌ను ప్రశ్నించాడు. సమాధానం చెప్పేలోపే మహేశ్ ఫోన్ లాక్కుని, దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతోనే ప్రాణాలు దక్కించుకోవడానికి మహేశ్ ఎన్టీఆర్ నగర్‌కు చేరుకోగా, స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. తనపై హత్యాయత్నం చేసిన పత్రి కుమార్, తనకు సహకరించిన వారిని గుర్తించాలని మహేశ్ పోలీసులను కోరారు. తనను, తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు.

గతంలో జీవిత ఖైదు అనుభవించిన నిందితుడు

ప్రధాన నిందితుడు పత్రి కుమార్ గతంలోనే ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడి, బెయిల్‌పై బయటకు వచ్చాడని అడుప మహేశ్ తెలిపారు. రాజకీయ కక్షల వల్లే పత్రి కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ కేసులో ప్రధాన నిందితుడు పత్రి కుమార్ కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపారు. ఇప్పటికే నేరంలో పాల్గొన్న జన్ను మధు, సంపత్ అనే వ్యక్తులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ విశ్వేశ్వర్ వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.