కాకతీయ, పెద్దవంగర : వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలతో పే స్కేల్ అమలు చేయాలని మూడు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీనెల సకాలంలో జీతాలు చెల్లించాలని, అదేవిధంగా ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఇతర ఉద్యోగులైన డీఆర్‌డీఏ విభాగాల ఉద్యోగులకు చెల్లించిన విధంగా సమాన వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్‌చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర మరియు జిల్లా జెఎసి ఆదేశాల మేరకు మండల ఎంపిడిఓ కి వినతి పత్రం అందించి నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలియజేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేని యెడల సమ్మెకు కూడా వెనుకాడబోమని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో సూదగాని యాకయ్య,సుమన్,సురేష్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
వీబీజీ రాంజీ పథకం ఉద్యోగుల నిరసన.
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

