epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేరాలకు చెక్.. గ్రామాల్లో పోలీసుల ఉక్కుపాదం..!

  • కోనరావుపేట పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం..
  • పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాల గుర్తింపు..
  • అనుమానితులపై నిఘా..
  • సీసీ కెమెరాల ఏర్పాటుకు, గంజాయి సమాచారంపై ప్రజలకు డీఎస్పీ శ్రీనివాసులు పిలుపు..

కాకతీయ, వేములవాడ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరింత దూకుడుగా చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శుక్రవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోనరావుపేట మండలంలోని గొల్లపల్లి, కమ్మరి పేట గ్రామాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు నేరాల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పోలీసులు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 39 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. సంబంధిత యజమానులు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి, వారి కదలికలు, వివరాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ… ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు భద్రతాభావాన్ని పెంపొందించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరచరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నారా అనే అంశాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామం, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేరాల నియంత్రణలో అవి అత్యంత కీలకంగా ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. యువత గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజా జీవనానికి భంగం కలిగించే లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎస్సై లు ప్రశాంత్ రెడ్డి, రమేష్, మోతీలాల్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.