epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆగస్టు 15లోగా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి

ఆగస్టు 15లోగా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి
పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలే కీలకం
పార్టీ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు 30 శాతం ప్రాతినిధ్యం తప్పనిసరి
సామాజిక సమతుల్యతతో కమిటీలను రూపొందించాలి
ఏఐసీసీ ప్రమాణాలు పాటించని కమిటీలకు ఆమోదం ఉండదు
హ‌న్మ‌కొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

కాకతీయ, హన్మ‌కొండ : “కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం క్షేత్రస్థాయి కార్యకర్తలే. బూత్, విలేజ్, మండల కమిటీల ఏర్పాటే పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తుంది. అధిష్ఠానం నిర్దేశించిన గడువులోగా కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలి” అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ ఆదేశాల మేరకు బూత్, విలేజ్, మండల స్థాయి కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మండల అధ్యక్షులు, ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి పల్లె శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి, వర్ధన్నపేట ఇంచార్జి కూచన రవళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హుస్నాబాద్, స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, పరకాల, హుజూరాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల అధ్యక్షులు, డీసీసీ ఇంచార్జ్ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

ఆగస్టు 15లోగా ప్రక్రియ పూర్తి చేయాలి

ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధిష్ఠానం ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉన్నందున పూర్తి బాధ్యతతో పనిచేసి ఆగస్టు 15లోగా అన్ని బూత్, విలేజ్, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మండల కమిటీలో సభ్యుల సంఖ్య 21 మందికి మించకూడదని, డీసీసీ అధ్యక్షుడి కోటా కింద ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యక్షుడి నియామకానికి సంబంధించిన అంశాల్లో మండల అధ్యక్షులు తనతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కమిటీల నియామకంలో సామాజిక న్యాయాన్ని తప్పనిసరిగా పాటించాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కమిటీలో కనీసం 30 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత భాగస్వామ్యం ఉండేలా కమిటీలను రూపొందించాలని సూచించారు. మహిళలకు ప్రాతినిధ్యం లేని కమిటీలను అధిష్ఠానం ఆమోదించదని చెప్పారు. కమిటీల ఏర్పాటు పూర్తయిన వెంటనే ఆగస్టు 15 నుంచి 31 మధ్య తొలి మండల కమిటీ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. నియామక ప్రక్రియలో మండల అధ్యక్షులు, ఇంచార్జ్‌లు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ వివాదాలకు తావులేకుండా కష్టపడే నాయకులకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఏఐసీసీ నిర్దేశించిన ప్రమాణాలు పాటించని కమిటీలకు డీసీసీ అధ్యక్షుడిగా తాను ఆమోదం తెలపబోనని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న మండల అధ్యక్షులు, ఇంచార్జ్ కమిటీ సభ్యులు కమిటీల ఏర్పాటు పురోగతిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.