epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్‌లో నకిలీ వైద్యులపై ఉక్కుపాదం

 

వరంగల్‌లో నకిలీ వైద్యులపై టీజీఎంసీ ఉక్కుపాదం
ప్రత్యేక దాడులు.. 16 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు
రిజిస్ట్రేషన్ దుర్వినియోగంపై డా. శ్రీహితకు షోకాజ్.. పరారీలో రుద్ర భాస్కర్

కాకతీయ, వరంగల్: వరంగల్ నగరంలో నకిలీ వైద్యులు, అనుమతి లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) ప్రత్యేక దాడులు నిర్వహించింది. శివనగర్, కరిమాబాద్, కీర్తినగర్, కాజీపేట, ఊరుగొండ, ఊర్సు, ఫోర్ట్ వరంగల్ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తుతో చేపట్టిన తనిఖీల్లో 16 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందజేసింది. తనిఖీల్లో అనుమతి లేకుండా క్లినిక్‌ల నిర్వహణ, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో ఇన్‌పేషెంట్ సేవలు, బెడ్లు ఏర్పాటు చేసి రోగులను చేర్చుకోవడం, సెలైన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం, అపరిశుభ్ర వాతావరణంలో చికిత్సలు అందించడం, బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ చెత్తలో పడవేయడం వంటి తీవ్ర ఉల్లంఘనలు గుర్తించినట్లు టీజీఎంసీ వెల్లడించింది.

కేసులు నమోదైన నకిలీ వైద్యులు
ఎ. రాములు – శివనగర్
కమలాకర్ – జయశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కీర్తినగర్
బండి రమేష్ – శ్వేత ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శివనగర్
వెంకటేశ్వర్లు – వెంకటేశ్వర క్లినిక్, కీర్తినగర్
బాబురావు – శివనగర్
ఎ. రమేష్ – కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఫోర్ట్ రోడ్
కృష్ణమూర్తి – కరిమాబాద్
టి. రాజమౌళి – విజయదుర్గ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కరిమాబాద్
శివశంకర్ – ఊర్సు
గడ్డం హరీష్ – ఊర్సు
గడ్డం శ్రీనివాస్ – ఊర్సు
ఎం. సిద్ధేశ్వర్ – జయలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కరిమాబాద్
జి. రామకృష్ణ – ఫోర్ట్ వరంగల్
కుమారస్వామి – కాజీపేట
సుధాకర్ – కాజీపేట
జి. వెంకటరాములు – ఊరుగొండ
రిజిస్ట్రేషన్ దుర్వినియోగం.. వైద్యురాలికి నోటీసులు

కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎ. రమేష్ తన క్లినిక్‌లో నమోదిత వైద్యురాలు డా. శ్రీహిత వైద్య రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో డా. శ్రీహితకు టీజీఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నమోదిత వైద్యులు తమ రిజిస్ట్రేషన్‌ను ఇతరులకు వినియోగించుకునేలా ఇవ్వడం తీవ్రమైన వృత్తిపరమైన ఉల్లంఘన అని మండలి స్పష్టం చేసింది. అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ వైద్యుడు రుద్ర భాస్కర్ తనిఖీల సమాచారం అందగానే పరారయ్యాడు. మరో నకిలీ వైద్యుడు లక్ష్మీనారాయణ కేసుల భయంతో తన క్లినిక్‌లోని బెడ్లు, వైద్య పరికరాలు, వాడిన సిరంజీలు, మందుల సీసాలు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ వైద్యం, అనుమతి లేని క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధ వైద్య సేవలు, నమోదిత వైద్యుల పేర్లు, రిజిస్ట్రేషన్ దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీజీఎంసీ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రజలు చికిత్స పొందే ముందు సంబంధిత వైద్యుడు తెలంగాణ వైద్య మండలి లేదా నేషనల్ మెడికల్ కమిషన్‌లో నమోదైన వైద్యుడేనా అని నిర్ధారించుకోవాలని, నకిలీ వైద్యుల సమాచారం ఉంటే 9154382727 నంబర్‌కు లేదా జిల్లా వైద్యాధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.