జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం : రవీందర్ రెడ్డి
కాకతీయ, పెద్దవంగర: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సంకెపల్లి రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దవంగర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన అందించిన భావజాలం, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజ అభ్యున్నతి, ప్రాంతీయ సమాన అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం జయశంకర్ చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హరికృష్ణ, మాజీ ఎంపీటీసీ రవి, ఉపసర్పంచ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

