స్వప్నకు అండగా బీఆర్ఎస్
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఇటీవల అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
గురువారం నేక్కొండ మండల కేంద్రంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు కొమ్ము రమేష్ యాదవ్ ఇంట్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ, సుదర్శన్ రెడ్డి లేరని అధైర్యపడవద్దని కార్యకర్తలకు సూచించారు. సుదర్శన్ రెడ్డికి ఎలా అండగా నిలిచారో, అదే విధంగా ఆయన సతీమణి పెద్ది స్వప్నకు కూడా ప్రజలందరూ సహకరించాలని కోరారు.
మాజీ సీఎం కేసీఆర్
స్వప్న కుటుంబానికి అండగా ఉంటారని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మీకు అండగా పెద్ది స్వప్న, మండల నాయకత్వం, మేము ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు బలవంతంగా కేసులు నమోదు చేస్తున్నారని, అందుకు భయపడవద్దని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, సీనియర్ నాయకుడు కొమ్ము రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శివకుమార్, మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, రవి, వీరభద్రం, వెంకన్న, వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

