epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నకిలీ ఇంటి నంబర్‌తో మోసం

నకిలీ ఇంటి నంబర్‌తో మోసం
పంచాయతీ వెబ్‌సైట్‌లో ఫోర్జరీ రికార్డు
రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించేందుకు యత్నం.. ఐదుగురు అరెస్టు

కాకతీయ, ఆత్మకూర్ : ఇంటి స్థలానికి అక్రమంగా నకిలీ ఇంటి నంబర్‌ సృష్టించి, దానిని రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించేందుకు ప్రయత్నించిన కేసులో ఐదుగురిని ఆత్మకూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ, మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై క్రైమ్‌ నంబర్‌ 152/2026 కింద బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 318(4), 336(3) రెడ్‌విత్‌ 3(5) ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ మండలం పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి నాగెల్లి అలియాస్‌ మరపల్లి సంపూర్ణ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బలభద్ర రాంబాబుకు 2019లో కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన ఆస్తి పంపకాల్లో 140 చదరపు గజాల ఇంటి స్థలం వచ్చింది. ఆ స్థలాన్ని విక్రయించేందుకు యాక రాజుతో రూ.9.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.3 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.

సబ్‌ నంబర్‌గా 4-168/1 సృష్టింపు

స్థలానికి ఇంటి నంబర్‌ లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ ఆలస్యం అవుతుందని భావించిన రాంబాబు, ఆత్మకూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న బారుపట్ల సురేష్‌ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. త్వరగా ఇంటి నంబర్‌ సృష్టించి ఇస్తానని చెప్పడంతో సురేష్‌కు రూ.10 వేల నగదు ఇచ్చినట్లు వెల్లడైంది. రాంబాబు సోదరుడి ఇంటి నంబర్‌ 4-168కు సబ్‌ నంబర్‌గా 4-168/1ను సృష్టించేలా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. సురేష్‌ రాంబాబు వివరాలను గెదిపే రమేష్‌కు పంపి రూ.8 వేల వరకు ఇచ్చినట్లు తెలిపారు. రమేష్‌ అందులో రూ.4,500ను ఫోన్‌పే ద్వారా సుందరి ఉదయ్‌కుమార్‌కు పంపాడు. అనంతరం ఉదయ్‌కుమార్‌ పంచాయతీరాజ్‌ శాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ మొహమ్మద్‌ అజీజ్‌కు వివరాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. అజీజ్‌ తెలంగాణ ఈ-పంచాయతీ వెబ్‌సైట్‌లో పెద్దాపూర్‌ గ్రామ వివరాలను ఉపయోగించి ఇంటి నంబర్‌ 4-168/1, అసెస్‌మెంట్‌ నంబర్‌ 944 పేరుతో నకిలీ రికార్డు సృష్టించినట్లు గుర్తించారు. అందులో బలభద్ర రాంబాబు పేరుతో 2026 ఏప్రిల్‌ 1 నుంచి 2027 మార్చి 31 వరకు రూ.525 ఇంటి పన్ను విధించినట్లు నమోదు చేశారు. తయారు చేసిన నకిలీ పత్రాన్ని వాట్సాప్‌ ద్వారా పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

నకిలీ పత్రాన్ని ప్రింట్‌ తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించేందుకు రాంబాబు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శికి సమాచారం లేకుండా ఇంటి నంబర్‌ కేటాయించడంతో అనుమానం వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో మొత్తం వ్యవహారం బయటపడింది. ఈ కేసులో ఎ1 బలభద్ర రాంబాబు, ఎ2 బారుపట్ల సురేష్‌, ఎ3 గెదిపే రమేష్‌, ఎ4 సుందరి ఉదయ్‌కుమార్‌, ఎ5 మొహమ్మద్‌ అజీజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఇంటి నంబర్‌ సృష్టించడం, తప్పుడు పన్ను వివరాలు నమోదు చేయడం, డిజిటల్‌ మార్గాల్లో పత్రాలను పంపించడం, నగదు, ఫోన్‌పే ద్వారా డబ్బులు బదిలీ చేయడంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించే ప్రయత్నాలను సహించబోమని పోలీసులు హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.