ఘనంగా కాకతీయ వార్షికోత్సవ వేడుకలు
జీవన సంధ్య వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉత్తరం కాకతీయ దిన పత్రిక తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కాకతీయ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా బ్యూరో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కాకతీయ పత్రిక అనతికాలంలోనే ప్రజల ఆదరణ పొందిందన్నారు. అక్రమాలు, ప్రజా సమస్యలపై నిరంతరం కథనాలు ప్రచురిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొంటోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రిపోర్టర్లు కోటేష్, మురళి, రామారావు, మిత్రులు విజయ్, మహేష్ పాల్గొన్నారు.


