మడికొండలో కేసీఆర్ భోజనం.. మారిన షెడ్యూల్‌తో అయోమయం
కాకతీయ, నల్లబెల్లి: మాజీ సీఎం కేసీఆర్ నల్లబెల్లి పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోవడంతో పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొంది. ముందుగా నిర్ణయించిన సమయం కంటే చాలా ఆలస్యంగా పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరకపోవడంతో ఆయన పర్యటనపై స్పష్టత లేకుండా పోయింది.
కేసీఆర్ నల్లబెల్లికి వస్తారన్న సమాచారంతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సుదర్శన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయన రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోవడంతో కేడర్‌లో అయోమయం నెలకొంది.
మడికొండలో భోజనం
ప్రస్తుత సమాచారం ప్రకారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరనున్న కేసీఆర్.. నల్లబెల్లికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని భోజనం చేయనున్నారు.
భోజనం అనంతరం కేసీఆర్ తిరిగి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పర్యటన సమయాల్లో మార్పులు చోటుచేసుకోవడంతో తుది షెడ్యూల్‌పై అధికారిక సమాచారం కోసం కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.

