కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలి
డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్
నెల్లికుదురులో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రంలో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని శనివారం డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తాను ఏనాడూ పదవులను ఆశించి పనిచేయలేదని నూతన మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి అన్నారు. పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఎలాంటి గ్రూపులకు తావులేకుండా నాయకులు, కార్యకర్తలు ఒకే తాటిపై నడవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే పార్టీకి ఎదురుండదన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, సమ్మె గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ హెచ్. వెంకటేశ్వర్లు, నాయకులు సత్యపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, ఆకుతోట సతీష్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

