epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వ పెద్దపీట

ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వ పెద్దపీట
ఆకలి లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు
సన్న బియ్యంతో పేదలకు కడుపునిండా భోజనం
పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి : పేదల ఆకలి తీర్చడంతో పాటు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కార్డు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. పేద కుటుంబాలు సైతం నాణ్యమైన సన్న బియ్యంతో రెండు పూటలా కడుపునిండా భోజనం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన బియ్యం తినాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సన్న బియ్యం ప్రయోజనం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి అందాలంటే రేషన్ కార్డు కీలకమని పేర్కొన్నారు.

అర్హులైన వారికి ప్రాధాన్యం

గతంలో రేషన్ కార్డుల కోసం ఎంతోమంది పేదలు ఎదురుచూశారని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేని పేద కుటుంబాలను గుర్తించి వారికి ముందుగా కార్డులు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారి కంటే నిజమైన పేదలు, నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొనుగోలు శక్తి లేని కుటుంబాలకు ప్రభుత్వ సహాయం ముందుగా అందాలన్నారు. రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీతో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు

తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రేషన్ డీలర్లు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు అందించడంతో పాటు తలసేమియా బాధితులకు కూడా పింఛన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

పేదల జీవితాల్లో భరోసా

పేదల కష్టాలు, కన్నీళ్లు తుడిచి వారి జీవితాల్లో భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, సివిల్ సప్లై అధికారి షా ఫైజల్ హుస్సేని, డీఎం కృష్ణవేణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.