కుంజా సూర్యపై తప్పుడు ప్రచారం చేశారు
బెట్టింగ్‌కు పాల్పడుతున్నారంటూ అసత్య ఆరోపణలు
రాజకీయాలకు అతీతంగా యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు
సతీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు యువజన కాంగ్రెస్ ఫిర్యాదు
కాకతీయ, ఏటూరునాగారం : రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజా సూర్యపై మాజీ బీఆర్‌ఎస్ రేడ్కో చైర్మన్ వై. సతీష్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ యువజన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుంజా సూర్య బెట్టింగ్‌కు పాల్పడుతున్నారంటూ సతీష్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మహేష్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజకీయ భేదాలకు అతీతంగా కుంజా సూర్య యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. క్రీడా సామగ్రితో పాటు అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కుంజా సూర్యపై తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇకనైనా తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ వసంత శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గంట కృష్ణారెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

