వెంకటస్వామికి కురుమల ఘన సన్మానం
బార్ధన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన కురుమ సంఘం నాయకులు
కాకతీయ, వరంగల్ : బార్ధన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోరే వెంకటస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం కురుమ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. రామ్‌కిలోని వెంకటస్వామి స్వగృహానికి వెళ్లిన వరంగల్ కురుమ పెళ్లి పందిరి కన్వీనర్లు, మహబూబాబాద్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు చీర అశోక్ కురుమ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అన్నరాజు కురుమ మాట్లాడుతూ బార్ధన్ మర్చంట్ అసోసియేషన్ అభివృద్ధికి వెంకటస్వామి కృషి చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మండల నరసింహ, రాములు, నరిగె శ్రీను, బండారి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

