శ్రీభద్రకాళి అమ్మవారికి సారే సమర్పించిన ఆడపడుచులు
శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు
కాకతీయ, వరంగల్ : శ్రావణమాసం సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీభద్రకాళి దేవాలయంలో మంగళవారం అమ్మవారికి సారే సమర్పించారు. రంగసాయిపేటకు చెందిన శంకేసి రమాదేవి ఆధ్వర్యంలోని మహిళల బృందం తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళలు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పిండి వంటకాలను ఆలయానికి తీసుకువచ్చి ప్రధాన పూజారి భద్రకాళి శేషు సమక్షంలో వేదమంత్రాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఇటికాల సంధ్యారాణి, పెద్ది మమత, మడూరి సంధ్య, అడుప సరిత, దూలం మంజుల, బోరిగం రజిత, కొండ్ర గోపి, కోయడ సుజాత, కుల్ల విజయలక్ష్మి, ద్రౌపతి రజిత తదితరులు పాల్గొన్నారు.

