రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : రెవెన్యూ పట్టా, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులకు ప్రభుత్వం అందించే ఎరువులు, రైతు సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. మండలంలోని పట్టాదారు రైతులందరూ తమ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్‌తో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.

