చిన్నారి చికిత్సకు దాతలే దిక్కు
విద్యుత్ ప్రమాదంలో జీవితం అతలాకుతలం
రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు
కాకతీయ, హనుమకొండ: ఇంటిపై ఆడుకుంటుండగా 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిన 11 ఏళ్ల చిన్నారి అభికరుణ్ ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్‌సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సెప్టెంబర్ 4న జరిగిన ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. వైద్యుల సూచనల మేరకు మరో 2–3 నెలలు చికిత్స అవసరమని, ఇందుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న చిన్నారి తండ్రికి అందుబాటులో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకం కార్డు ప్రస్తుతం ఉపయోగపడకపోవడంతో వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడుతున్న కుటుంబానికి భారీ వ్యయం భారంగా మారిందని తెలిపారు. చిన్నారి చికిత్స కొనసాగించేందుకు దాతలు, మానవతావాదులు ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. సహాయం చేయదలచిన వారు 8520942727 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

