epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

2–3 ఏళ్లలో ఈ-బైక్‌ల వాటా 20 శాతానికి

2–3 ఏళ్లలో ఈ-బైక్‌ల వాటా 20 శాతానికి
రూ.779 కోట్లతో కొత్త ప్లాంట్‌.. ఏటా 5 లక్షల వాహనాల ఉత్పత్తి లక్ష్యం
రూ.2 లక్షలలోపే కొత్త మోడళ్లు.. విదేశీ మార్కెట్లపై సంస్థ దృష్టి
ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సంస్థ అల్ట్రావైలెట్‌ ఆటోమోటివ్‌  అంచనా
కాకతీయ,  బిజినెస్ డెస్క్ : దేశీయ మోటార్‌సైకిల్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ బైక్‌లకు ఆదరణ వేగంగా పెరుగుతోందని బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సంస్థ అల్ట్రావైలెట్‌ ఆటోమోటివ్‌ తెలిపింది. రాబోయే 2–3 ఏళ్లలో దేశంలో మొత్తం మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌ల వాటా 20 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. తమిళనాడులోని హోసూర్‌ సమీపంలో కొత్త తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు రాబోయే 5 ఏళ్లలో రూ.779 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్త ప్లాంట్‌ తొలి దశలో ఏటా 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 50–60 వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలుపుకొని.. 2–3 ఏళ్లలో మొత్తం సామర్థ్యాన్ని 3 లక్షల యూనిట్లకు, 5 ఏళ్లలో 5 లక్షల యూనిట్లకు చేర్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.2 లక్షలలోపే కొత్త బైక్‌లు
ప్రస్తుతం ఎఫ్‌77, ఎక్స్‌47 మోడళ్లను విక్రయిస్తున్న అల్ట్రావైలెట్‌.. త్వరలో *షాక్‌వేవ్‌ మోటార్‌సైకిల్‌, టెస్సెరాక్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌*ను మార్కెట్లోకి తీసుకురానుంది. రాబోయే 2 ఏళ్లలో తమ మోడళ్ల సంఖ్యను 6కు పెంచాలని నిర్ణయించింది. కొత్త మోడళ్ల ధరలను రూ.2 లక్షలలోపే ఉండేలా చూస్తున్నామని సంస్థ కో-ఫౌండర్‌, సీటీఓ నీరజ్‌ రాజ్‌మోహన్‌ తెలిపారు. కొత్త ఉత్పత్తుల రాకతో నెలకు 10 వేల యూనిట్ల విక్రయాలను సాధించగలమని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
విదేశీ మార్కెట్లపైనా దృష్టి
ప్రస్తుతం 20 యూరోపియన్‌ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్ట్రావైలెట్‌.. తదుపరి దశలో ఉత్తర అమెరికా, లాటిన్‌ అమెరికా మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. స్కూటర్ల విభాగంలో ప్రారంభమైన ఎలక్ట్రిక్‌ మార్పు ఇప్పుడు మోటార్‌సైకిళ్ల విభాగానికీ విస్తరిస్తోందని సంస్థ సీఈఓ నారాయణ్‌ సుబ్రమణ్యం తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు ఎలక్ట్రిక్‌ బైక్‌లకు డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రికార్డు స్థాయికి పసిడి ధరలు

రికార్డు స్థాయికి పసిడి ధరలు కిలో వెండి రూ. 2.70 లక్షలు 10 గ్రాముల...

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్...

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

రూ.30 వేలు తగ్గిన వెండి

రూ.30 వేలు తగ్గిన వెండి ఒక్క రోజులోనే దిగొచ్చిన ధ‌ర‌ 24 క్యారెట్ల 10...

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?

బ్యాంక్ కస్టమర్లకు ఊరట? అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు! ఆర్బీఐ కసరత్తు షురూ కాక‌తీయ‌,...

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ :...

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.