epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?
అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు!
ఆర్బీఐ కసరత్తు షురూ

కాక‌తీయ‌, బిజినెస్ : బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు త్వరలో శుభవార్త లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకును బట్టి వేర్వేరుగా ఉన్న కనీస బ్యాలెన్స్‌ నిబంధనలు, ఏటీఎం వార్షిక ఫీజులు, ఇతర సేవా రుసుములను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఒకే విధంగా (ప్రామాణికంగా) అమలు చేసే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులతో ఆర్బీఐ ఇప్పటికే చర్చలు జరుపుతోంది.

అదనపు భారం తగ్గించేందుకే..!

ప్రస్తుతం ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులలో కనీస బ్యాలెన్స్ (Minimum Balance) నిర్వహణ నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఇది రూ.10 వేలుగా ఉండగా, మరికొన్నింటిలో రూ.15 వేలుగా ఉంది. అలాగే, ఏటీఎం వార్షిక ఛార్జీలు కూడా బ్యాంకును బట్టి మారుతున్నాయి. ఈ భిన్నమైన నిబంధనల కారణంగా కస్టమర్లు తరచూ అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతోనే ‘ప్రామాణిక సేవా రుసుము విధానం’ (Standardised Service Charges) తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది.

పారదర్శకంగా ప్రాసెసింగ్‌ ఫీజులు..

బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం ప్రకారం, వివిధ సేవలపై వసూలు చేస్తున్న ఛార్జీలను సరళీకృతం చేయడమే ఈ ప్రతిపాదనల ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా, రుణాలకు (Loans) సంబంధించి దరఖాస్తు చేసినప్పటి నుంచి మంజూరు లేదా తిరస్కరణ వరకు వసూలు చేసే ప్రాసెసింగ్‌ ఫీజులను పూర్తిగా పారదర్శకంగా, ముందే తెలియజేసేలా నిబంధనలు రూపొందించనున్నారు. దీంతో కస్టమర్లకు ఎలాంటి అయోమయం ఉండదని ఆర్బీఐ భావిస్తోంది. అదేవిధంగా, కనీస బ్యాలెన్స్‌ నిర్వహించనందుకు విధిస్తున్న జరిమానాలపై కూడా ఆర్బీఐ పునఃపరిశీలన జరపనుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ జరిమానాలను ఉపసంహరించుకున్నాయి. ఆర్బీఐ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు మరింత సులభంగా, కస్టమర్‌కు అనుకూలంగా మారతాయని బ్యాంకింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రికార్డు స్థాయికి పసిడి ధరలు

రికార్డు స్థాయికి పసిడి ధరలు కిలో వెండి రూ. 2.70 లక్షలు 10 గ్రాముల...

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్...

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

రూ.30 వేలు తగ్గిన వెండి

రూ.30 వేలు తగ్గిన వెండి ఒక్క రోజులోనే దిగొచ్చిన ధ‌ర‌ 24 క్యారెట్ల 10...

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ :...

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ...

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..?

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..? హెచ్‌పీ లేఆఫ్స్‌ కలకలం ఏఐ ధాటికి 6...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.