నల్ల నర్సింలు జయంతి వేడుకలు నిర్వహించాలి
సబ్బండ వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలి
అక్టోబర్ 2న జనగామలో వేడుకలను విజయవంతం చేయాలి
మన ఆలోచన మన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నరసింహులు పిలుపు
కాకతీయ, జనగామ : నల్ల నర్సింలు 100వ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన వైభవంగా నిర్వహించాలని మన ఆలోచన మన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింహులు పిలుపునిచ్చారు. బుధవారం జనగామ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణ అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కటకం నరసింహులు మాట్లాడుతూ బలహీన, అట్టడుగు, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. అక్టోబర్ 2న జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించే నల్ల నర్సింలు శత జయంతి వేడుకలను బీసీలంతా కలిసి విజయవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నల్ల నర్సింలు విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వేముల బాలరాజ్, మాజీ జడ్పీటీసీ చింతకింది అరుణ, దాసరి జనార్ధన్, చింతకింది కృష్ణమూర్తి, డాక్టర్ శ్రీనివాస్, ఎనగందుల కృష్ణ, గునిగంటి రామకృష్ణ, మధుసూదన్, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

