epaper
Sunday, September 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?!

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?!
రాయపర్తి పీహెచ్‌సీలో ఉదయమూ కనిపించని డాక్టర్లు 
ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు పెడచెవిన పెడుతున్న వైద్యులు
ఓపి వేళలోనూ జాడ లేని వైద్యులు..రోగుల ఎదురుచూపులు..
ఈసారైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా?
లేక మళ్లీ గాలికి వదిలేస్తారా? 
కాకతీయ, రాయపర్తి : ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు చేసినా రాయపర్తి పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు కనిపించడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల ఆసుపత్రి సాయంత్రం 4 గంటలకే తాళాలు వేస్తున్నదనే అంశంపై గతంలో కథనం ప్రచురితమవడంతో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, డీఎంహెచ్‌వో రాజిరెడ్డి ఆసుపత్రిని తనిఖీ చేశారు. దీంతో పరిస్థితి మారుతుందని ప్రజలు భావించినా.. కొద్దిరోజులకే మళ్లీ పాత పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఓపీ సేవలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు 10, 11 గంటలు దాటినా ఆసుపత్రికి రావడం లేదని రోగులు వాపోతున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు గంటల తరబడి వైద్యుల కోసం ఎదురుచూస్తున్నారని, చివరకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తనిఖీలు చేసినా.. చర్యలేవీ?
ఎమ్మెల్యే, కలెక్టర్‌, డీఎంహెచ్‌వో హాజరు పట్టికలను పరిశీలించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో మార్పు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు కేవలం ఫొటోలు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ప్రజలు అంటున్నారు. విధులకు గైర్హాజరవుతున్న వారిపై చర్యలు లేకపోవడంతోనే నిర్లక్ష్యం కొనసాగుతోందని పేర్కొంటున్నారు.
బాధితుడు మహమ్మద్‌ రెహమాన్‌
శనివారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన తనకు 10:45 గంటలైనా డాక్టర్‌ అందుబాటులోకి రాలేదని మహమ్మద్‌ రెహమాన్‌ తెలిపారు. అస్వస్థతతో ఆసుపత్రికి వచ్చినా వైద్యులు లేక గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, డీఎంహెచ్‌వో స్పందించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
      బాధితుడు మహమ్మద్ రహమాన్

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి పేపర్‌ లీకేజీలు, పరీక్షల జాప్యాలకు అడ్డుకట్ట వేయాలి విద్యార్థులు,...

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి గూడెప్పాడు శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం లారీ...

గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక

గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక 375 రకాల పనుల్లో ప్రాధాన్య పనుల గుర్తింపు ప్రజల...

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు వ‌చ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే ఉప‌యోగ‌ప‌డింది 2014లో...

కడియం.. రెడీగా ఉండు!

కడియం.. రెడీగా ఉండు! దానం నాగేందర్‌లాగే నీపైనా అనర్హత వేటు తప్పదు ఫిరాయింపులపై హైకోర్టు...

రహుమునిషా బేగంకు పరామర్శ

రహుమునిషా బేగంకు పరామర్శ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ నాయకురాలు రహుమునిషా...

నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి

నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి ఆదివారం లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చెరువుల్లో...

జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి

జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి సమగ్ర ప్రాపర్టీ సర్వేకు పకడ్బందీ కార్యాచరణ సర్వేను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.