epaper
Monday, September 21, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు
రూ. 4.20 లక్షల వరకు అక్రమ వసూళ్లు
పోలీస్‌ యూనిఫాం, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం
మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌
కాకతీయ, మహబూబాబాద్‌ : పోలీసులుగా నటిస్తూ బంగారు వ్యాపారులను ఫోన్‌లో బెదిరించి ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను కేసముద్రం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పోలీస్‌ యూనిఫాం, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ తెలిపారు. నిడమనూరుకు చెందిన షేక్‌ ఇర్ఫాన్‌ (29), చింతలచేరువు ప్రశాంత్‌ (26) నిందితులుగా గుర్తించారు. ఇర్ఫాన్‌ పోలీస్‌ యూనిఫాం ధరించి ఫొటో తీసుకుని వాట్సాప్‌, ట్రూకాలర్‌లో డీపీగా పెట్టుకున్నాడు. కేసముద్రం మండలానికి చెందిన బంగారు వ్యాపారి బోగోజు వేణుగోపాలచారికి ఫోన్‌ చేసి తాను వికారాబాద్‌ సమీపంలోని పార్వతీపురం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐనంటూ పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు దొంగలను పట్టుకున్నామని, వారు దొంగిలించిన బంగారాన్ని వ్యాపారి కొనుగోలు చేశాడంటూ బెదిరించి వాట్సాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ పంపి రూ. 88,026 వసూలు చేశాడు. సాంకేతిక ఆధారాలు, సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ వివరాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్ల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు 20-09-2026న అరెస్ట్‌ చేశారు. 15-08-2026 నుంచి 15-09-2026 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంగారు వ్యాపారుల నుంచి సుమారు రూ. 4,20,000 వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతంలోనూ వీరిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్‌, క్యూఆర్‌ కోడ్‌లకు స్పందించవద్దని, సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌ 

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌  కాకతీయ, నెల్లికుదురు:...

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి విద్యతోనే బీసీలు ఉన్నతమైన ఎదుగుద‌ల సాధ్యం హక్కుల సాధ‌న‌కు...

కోల్డ్‌ ‘చోరేజీలు’!

కోల్డ్‌ ‘చోరేజీలు’! ఏనుమాములలో జీరో చీకటి వ్యాపారం ప్రభుత్వ నిఘా ఉన్నా ఆగని దందా! తెర...

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌!

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌! సేవా స్ఫూర్తితో 17 ఏళ్ల ప్రస్థానం 2009లో...

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ దూర ప్రాంతాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు విద్యార్థులు లక్ష్యాన్ని...

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కాకతీయ, పెద్దవంగర : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మండల...

తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్‌

తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్‌ డబ్బుల విషయంలో గొడవలే హత్యకు కారణం ఏసీపీ...

మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య

మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య అన్న చేతిలో తమ్ముడు బలి.. కత్తితో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.