స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన
కాకతీయ,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి లోని బాలికల గురుకుల విద్యాలయంలో స్వచ్ఛతే పై విద్యార్థినులకు మంగళవారం గాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి రేవంత్,స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం చెత్త ఉత్పత్తి అయ్యే చోట్ల లోనే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఉండేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు చెత్తను బాధ్యతగా నిర్వహించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
ఘన వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారధి,పంచాయతీ కార్యదర్శి విజయ లక్ష్మీ,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

