epaper
Thursday, November 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగించాలి

భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగించాలి
సెల్‌ఫోన్‌ బానిసత్వానికి పిల్లలు దూరంగా ఉండాలి
బాలల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలి
ఖ‌మ్మం అడిష‌న‌ల్ పోలీస్‌ కమిషనర్‌ రామానుజం
ఖమ్మంలో రాష్ట్రస్థాయి బాలోత్సవ్‌ ప్రారంభం
300 మందికి పైగా బాల కళాకారుల నృత్య ప్రదర్శనలు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : భారతీయ కళల వారసత్వాన్ని ప్రతి తరం కొనసాగించాలని, పిల్లల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా అదనపు పోలీస్‌ కమిషనర్‌ రామానుజం పిలుపునిచ్చారు. సెల్‌ఫోన్‌ బానిసత్వానికి పిల్లలు దూరంగా ఉండాలని, కళలు నేర్చుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదుగుతారని పేర్కొన్నారు. బుధవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో వారధి ఫౌండేషన్‌, ఖమ్మం డాన్సర్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖమ్మం బాలోత్సవ్‌ వేడుకలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. భారతీయ కళారూపాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయని, సంప్రదాయ జానపద కళలకు సినిమాల్లోనూ ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. సైబర్‌ నేరాల పట్ల కూడా పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నృత్యాలతో అలరించిన చిన్నారులు

ఖమ్మం డాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాయల నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో వారధి ఫౌండేషన్‌ చైర్మన్‌ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ బాలోత్సవ్‌లో పాల్గొనడమే పిల్లలకు గొప్ప విజయమని, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు అభినందనీయులని అన్నారు. తొలిరోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ తదితర జిల్లాల నుంచి 300 మందికి పైగా బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. సంప్రదాయ జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. డిజిటల్‌ తెరలు, లైట్ల వెలుగుల్లో సంప్రదాయ వస్త్రధారణతో సంగీతానికి అనుగుణంగా చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోలో క్లాసికల్‌, ఫోక్‌ డాన్స్‌ విభాగాల్లో 200, గ్రూప్‌ క్లాసికల్‌, ఫోక్‌ డాన్స్‌ విభాగాల్లో 40, ఫ్యాన్సీ డ్రెస్‌ విభాగంలో 50 ఎంట్రీలు నమోదయ్యాయి.

విజేతలకు గురువారం బహుమతులు

గురువారం సాయంత్రం వరకు పోటీలు కొనసాగనున్నాయని, అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మంలో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాలోత్సవ్‌కు బాలబాలికల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌, డాక్టర్‌ జంగాల సునీల్‌కుమార్‌, గ్రంథాలయ చైర్మన్‌ ఖాదర్‌బాబా, డాక్టర్‌ కాటమనేని రాజకుమార్‌, నృత్యదర్శకుడు ఆర్‌.ఎన్‌.ప్రసాద్‌, న్యాయనిర్ణేతలు లింగం శ్రీనివాసరావు, జైపాల్‌, ఖమ్మం డాన్సర్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు చిక్కుళ్ల వెంకటేష్‌, పగిల్లపల్లి రాజు, రాజేష్‌, భవానీశంకర్‌, ముకేశ్‌, నాని, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెలుగుమట్లలో పేదల ముసుగులో భూమాఫియా!

వెలుగుమట్లలో పేదల ముసుగులో భూమాఫియా! నిరుపేదల ఇళ్ల స్థలాల ఆశలతో అక్రమ వసూళ్లు సర్వే...

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి పాత...

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ కాకతీయ,ఖమ్మం...

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం!

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం! బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి భారీ సంఖ్య‌లో...

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం...

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి విగ్రహం యువతకు స్ఫూర్తినిస్తుంది: వీరవెల్లి...

భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు

భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు ​అసలు హంతకులను కాపాడేందుకు సీపీ సునీల్...

యాసంగిలో వరి సాగు వద్దు!

యాసంగిలో వరి సాగు వద్దు! వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.