epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వెలుగుమట్లలో పేదల ముసుగులో భూమాఫియా!

వెలుగుమట్లలో పేదల ముసుగులో భూమాఫియా!
నిరుపేదల ఇళ్ల స్థలాల ఆశలతో అక్రమ వసూళ్లు
సర్వే నంబర్లు 147, 148, 149లో ఆక్రమణలు
హైకోర్టు, సీసీఎల్ఏ ఆదేశాలతోనే తొలగింపులు
మిగిలిన దరఖాస్తులనూ పరిశీలించి అర్హులకు స్థలాలు : మంత్రి తుమ్మల

కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్‌ భూముల వ్యవహారంలో పేదల పేరుతో కొందరు అక్రమార్కులు భూమాఫియాగా ఏర్పడి, నిరుపేదలను మోసం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి, భయానక పరిస్థితులు సృష్టించారని తెలిపారు. అర్హులైన పేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఖమ్మం అర్బన్‌ మండలం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో మిగిలిన అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ మంగళవారం మంత్రి తుమ్మలను కలిశారు. ఈ సందర్భంగా భూముల ఆక్రమణలు, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలు, అధికారిక రికార్డుల్లోని వివరాలను మంత్రి ఆయనకు వివరించారు.

పోలీసులూ వెళ్లలేని పరిస్థితి సృష్టించారు

సర్వే నంబర్లు 147, 148, 149లో భారీగా అక్రమ ఆక్రమణలు జరిగాయని మంత్రి తెలిపారు. పేదల పేరుతో కొందరు వ్యక్తులు సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, ఇళ్ల స్థలాల ఆశ చూపి డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. చివరకు పోలీసులు సైతం అక్కడికి వెళ్లలేని విధంగా భయానక పరిస్థితులు సృష్టించారని వివరించారు. హైకోర్టు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ 2023లో జారీ చేసిన ఆదేశాల మేరకే రెవెన్యూ యంత్రాంగం ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ చర్యలు పేదలకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి కాపాడేందుకేనని స్పష్టం చేశారు. మంత్రి అధికారిక రికార్డులు, ఆధారాలతో వివరాలు వెల్లడించడంతో వెలుగుమట్లలో జరిగిన పరిణామాలపై జస్టిస్‌ చంద్రకుమార్‌ విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అక్కడి అక్రమాలు, భూమాఫియా కార్యకలాపాల గురించి తనకు పూర్తి సమాచారం తెలియలేదని, కొందరు తప్పుడు వివరాలిచ్చి తనను తప్పుదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయి విచారణలో అర్హులుగా గుర్తించిన పేదలకు ఇప్పటికే నివాస స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తుమ్మల తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా సమగ్రంగా పరిశీలించి నిజమైన అర్హులకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం ప్రభుత్వ బాధ్యతని, వారి ఆశలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి పాత...

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ కాకతీయ,ఖమ్మం...

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం!

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం! బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి భారీ సంఖ్య‌లో...

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం...

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి విగ్రహం యువతకు స్ఫూర్తినిస్తుంది: వీరవెల్లి...

భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు

భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు ​అసలు హంతకులను కాపాడేందుకు సీపీ సునీల్...

యాసంగిలో వరి సాగు వద్దు!

యాసంగిలో వరి సాగు వద్దు! వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు మంత్రి...

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన రెండు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.