epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పండుగకు పల్లెబాట..

పండుగకు పల్లెబాట..
హైవేలపై ట్రాఫిక్‌ పాట్లు!
చౌటుప్పల్‌, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపివేత
విజయవాడ హైవేపై 45 నిమిషాల నుంచి గంటకుపైగా నిరీక్షణ
బస్టాండ్లు కిటకిట.. ప్రత్యేక బస్సుల ఛార్జీలపై ప్రయాణికుల ఆగ్రహం

కాకతీయ, హైదరాబాద్‌ : దసరా పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు నగరవాసులు పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్‌–విజయవాడ హైవేతో పాటు హైదరాబాద్‌–ముంబై, చెన్నై మార్గాల్లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం మహర్నవమి, మంగళవారం విజయదశమి సెలవులు రావడంతో కుటుంబాలతో కలిసి సొంత వాహనాల్లో బయలుదేరిన వారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రయాణికులు ట్రాఫిక్‌ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై విస్తరణ, ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ట్రాఫిక్‌ రద్దీకి కారణమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరగా, పట్టణాన్ని దాటేందుకు 45 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. చిట్యాల వద్ద కూడా ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడ గంటకుపైగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ పెరగడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 24 టోల్‌ బూత్‌లలో 16 తెరిచి ఉంచారు. హైదరాబాద్‌–వరంగల్‌, హైదరాబాద్‌–కరీంనగర్‌ రహదారులతో పాటు యాదాద్రి టోల్‌ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది. ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు చేపడుతున్న చర్యలు సరిపోవడం లేదని పలువురు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బస్టాండ్లలో రద్దీ.. ప్రత్యేక బస్సుల ఛార్జీలపై అసహనం

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, ఆరాంఘర్‌ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ చెబుతున్నా, ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని పలువురు చెబుతున్నారు. బస్సులు కిక్కిరిసి నడుస్తుండటంతో ప్రైవేటు వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఇంటికి చేరుకోవాలన్న ఆశతో బయలుదేరిన వారికి హైవేలపై ట్రాఫిక్‌ జామ్‌లు పండుగ ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మారుస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మూడు దశల్లో సమగ్ర భూసర్వే

మూడు దశల్లో సమగ్ర భూసర్వే 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు...

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం పూల పండుగ మహిళల...

ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి

ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి :డా....

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు జిల్లాల అధికారులతో...

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండ సమస్యలపై అధ్యయనం చేసి...

15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు

15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు లామినేషన్‌ అవసరం లేకుండా...

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సేవామూర్తి అణగారిన...

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి 13 కోట్ల ఓట‌ర్ల‌ పేర్ల తొలగింపుపై సీఐటీయూ నిరసన ఢిల్లీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.