రాములు కుటుంబానికి
గౌడ సంఘం పరామర్శ
కాకతీయ, ఇనుగుర్తి: గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం సభ్యులు బండారి రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, సంఘ బాధ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాములు మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, సంఘం తరపున ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం అధ్యక్షులు కూటికంటి మధు గౌడ్ మాట్లాడుతూ… కష్టకాలంలో సభ్యులకు అండగా ఉండటమే సంఘం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. సంఘం ఐక్యత కోసం, ఆర్థిక బలోపేతం కోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కూటికంటి మధు, కోశాధికారి వేముల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బండారి మధు, బుర్ర సుధాకర్, గడ్డం శ్రీకాంత్, అలాగే కార్యవర్గ సభ్యులు బుర్ర సందీప్, వేముల రాకేష్, బొమ్మేర మహేష్, గడ్డం సునీల్, గండు రాము, బండారి సది, బండారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

