శాంతియుతంగా దసరా పండుగ
టీఎస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ముల ఏసేబు
సీఐ విశ్వేశ్వర్‌కు కృతజ్ఞతలు
కాకతీయ, గీసుగొండ: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే దసరా పండుగను గీసుగొండ మండలంలో శాంతియుతంగా నిర్వహించేందుకు కృషి చేసిన సీఐ విశ్వేశ్వర్‌కు టీఎస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ముల ఏసేబు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని 21 గ్రామపంచాయతీలు, వివిధ గ్రామాల్లో దసరా వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టి,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం అభినందనీ యమన్నారు. పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకునేలా సహకరించిన సీఐ విశ్వేశ్వర్‌తో పాటు పోలీసు సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

